కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Tuesday, December 11, 2012

ప్రేమించడానికి అమ్మాయి  అబ్బాయి ఉంటె  సరి పోదు వాళ్ళ  ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి  ..

Thursday, December 6, 2012

చదివిన కొద్ది  అర్థంకాకపోగా.. అయోమయంలో పడేసే అందమైన పుస్తకమే ప్రేమ ..

Saturday, December 1, 2012

బగ్నమైన ప్రేమ లో , దగ్ధమైన హృదయం లో ఏడుపు , నిట్టుర్పు , కన్నిల్లె ....
తోడు , నీడ , సుఖాలుగా మారుతాయి !అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్నలు మరింత చికాకు పెడతాయి !!

Sunday, November 4, 2012

నా ఎడారి నడకల్లో

నా ఎడారి నడకల్లో
తడియారిన గొంతుకతో
ఒయసిస్సే నీవని ఓదార్పు నిస్తావని కోరుకున్ననిన్ను ....
ఎండమావి నీవని ..
ఎడద నీకు లేదని
ఏడుస్తున్న నేను ...................

ప్రేయసి కోసం

నిదుర పక్షులు రాల్చే
 కళల ఈకల్ని కుంచెగా మార్చి
అందమైన నీ రూపాన్ని తీర్చి దిద్దాలని ప్రయత్నించా
ఇంద్రధనస్సు ప్రత్యక్షమైంది
హృదయ లేఖల అక్షర నక్షత్రాలు
కవిత్వం గా  తీర్చి
అందమైన బావం కోసం ప్రయత్నిoచాను
సాగే సెలయేరు కనిపించింది
తెలవారే ఉదయాన
నీ పలకరింతకై పరితపించాను
లీల గా సుప్రబాత కీర్తన వినిపించింది
కల కళలాడే సాయం కాలానా
నీ స్పర్శ కై వేచి చూసాను
గుండెల పై వెన్నెల కురవడం తెలిసింది
ప్రియా .....
నీ జ్ఞాపకం గడియ తీస్తే చాలు ప్రకృతి అయి పలకరిస్తుంది ...

Monday, October 29, 2012

గుండెల్లో దాచుకున్న నీ జ్ఞాపకాలు కన్నీరుగా  బయటకు వస్తున్నాయి ...........

Tuesday, October 16, 2012

ప్రశాంతంగా ఉన్న నా ఈ జీవితం లో సుడిగాలి లా తను వచ్చి  అంతా చేధరగోట్టింది .....
      తన జ్ఞాపకాలు మాత్రం మిగిల్చి వెళ్లిపోయింది ...........

Saturday, September 22, 2012

ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు.... కాని! ఒక వ్యక్తికి నువ్వే ప్రపంచం.........
నీ కోసం వెతికి వెతికి అలిసనివి నా  కళ్ళు ,నా ప్రతి కన్నితో బిందువు లో నీ రూపమే ,
నువ్వు లేని నా  జీవితం అర్ధం లేనిదీ ,నిన్ను వెతుకుతూ నిన్ను చేరాలని ,
నా హృదయం పరితపించిన ఈ వేళ , నువ్వు నన్ను వద్దు అన్న నా మనుసు నువ్వే కావాలంటుంది ,
నువ్వు దూరం ఐన ప్రతి క్షణం నాకు ఒక యుగం లా  ఉంది ,
నువ్వు నన్ను చేరాలని , నీ ప్రేమ పొందాలని ,
ఎన్ని జన్మలైన నీ కోసం ఇలా ఎదురుచూస్తూ ,ఈ జీవితం లో వేరొకర్ని ఉహించుకోలేక ,
ఈ నా జీవితం తల్లడిల్లిపోతుంది ..........

Sunday, September 2, 2012

దేవుడు మనుషుల్ని ప్రేమించి ,వస్తువుల్ని వాడుకోవడానికి సృస్తించాడు ..
కానీ మనం మనుషుల్ని వాడుకొని ,వస్తువుల్ని ప్రేమిస్తున్నాం.....
ఎప్పుడు నేను ఒంటరి అని అనుకోవడం వల్లనేమో ,ఇప్పుడు నిజంగానే ఒంటరి గా  మిగిలిపోయా 

Thursday, August 30, 2012

అభిప్రాయాలూ  కలిస్తేనే ప్రేమ అనుకున్న ,కానీ మనసులు కలిస్తేనే ప్రేమ అని ఇప్పుడే తెలిసింది .........
prathi parichayam prema ani porapadaku..........

Wednesday, August 29, 2012

gundenu chappudunu veru chesinattu , kantini reppanu veru chesinattu,na oopirini na nundi veru chesthunnattuga undhi.oopiri digina deham tho ela jivinchagalanu , nuvvu levanna nijam nannu bathakanisthundha,naloni anuvanuvu nuvvu ga maraka,ika nenu nenuga undagalana,inni addankula madhya na premanu gelichedhela , ee  lokaniki mana antharanga madhananni telipedhela,asalu nuvvu lekunda bathikedhela,nuvvu leni nenoka jeevachavanni, kani na mansu cheputhunna matallo idhokkati nijam.....
                                                        
                                                          i loveyou

                                        

Sunday, August 26, 2012

నీకు నచ్చింది నువ్వు చేయాలనుకున్నప్పుడు ఏది నువ్వు చేయలేవు అది గుర్తుంచుకో ,పట్టుదల పాపిడి బిళ్ళ ఏవి పనికి రావు ,కృషి కాకరాయ ఇవన్ని ఒత్తి మాటలే ,నువ్వు చేసే ఎ ఎదవ పని ఐన నీ  ముందు ఉన్న వాడు బాగుంది అంటేనే అది ఎంతో కొంత సక్సెస్ అవుది ,లేకుంటే ఏమవుదో మిరే  ట్రై చేసి చూసుకోండి ......

Sunday, August 19, 2012

భయం తలుపు తట్టింది ,సాహసం తలుపు తీసింది
         ఎదురుగా ఎవరు కనిపించలేదు .....

Sunday, August 12, 2012

నిజం చెప్పి

నిజం చెప్పి- నన్ను హార్ట్ చేసిన సంతోషిస్తాను .
అబద్దం చెప్పి-నన్ను సంతోషింప చేయాలనీ చూస్తే మాత్రం  
తీవ్రంగా హార్ట్ అవుతాను .

ఇలా చూడు

నా అవతరాన్ని చూసి   'పేదోడు ' అన్నాడు మీ  నాన్న. నా గుండెల్లోకి  చూడామణి aఅడుగుతున్నాను .aఅక్కడ కోటను కోట్ల రత్నాలు ఉన్నాయి .వాటి vవిలువలో మీ నాన్న ఆస్థి ఎ పాటి ?!
రత్నాలు ఎక్కడి నుండి వచయనే కదా ని డౌట్ ?
నువ్వు నవ్వినప్పుడల్లా నవరత్నాలు డైరెక్ట్ గా  నా గుండెల్లోకి వచ్చి చేరేవి.

నన్ను నువ్వు ఎన్ని సార్లు ఏడ్పించిన ,
                                    నిన్ను నవ్వించే ఏకైక జోకర్  ని నేనే ...

Sunday, July 1, 2012

ఒక రొమాంటిక్ దెయ్యం కథ .....

రైలు ప్రయాణం .రాత్రి పదకొండు  దాటింది .అరుణ్ తప్ప బోగీలో అందరు నిద్రపోతున్నారు .తన ఎదుట సీటు ఖాలిగా ఉంది .రైలు ఎలుగురు అనే చిన్న రైల్వే స్టేషన్ లో ఆగింది .ఒక అందమైన అమ్మాయి రైలు ఎక్కింది .అ అమ్మాయి తన ముందు సీట్ లోనే కూర్చుంది .'అదృష్టం 'అనుకుంది అరుణ్ మనసు .ఐదు నిమిషాల్లో పరిచయమయ్యారు ఒకరికి ఒకరు .గంటలో ప్రేమలో పడ్డారు.
"అరుణ్ ......నువ్వు దెయ్యాలను నమ్ముతావా ?" అడిగింది అందమైన హారిక .
"నెవెర్ .......నమ్మను గాక నమ్మను " అన్నాడు అరుణ్ .
"మరి నువ్వు ?" అడిగాడు అరుణ్ .
"దెయ్యాలు ఉన్నాయో లేదో గాని దెయ్యాల కధలంటే మాత్రం చాల ఇష్టం " అన్నది హారిక .
"అయితే నీకు నచిన ఒక దెయ్యం కథ చెప్పు ?" ఆసక్తిగా అడిగాడు అరుణ్ .
హారిక ఇలా చెప్పింది .
'వరుణ్ ఒక అర్ధరాత్రి రైల్ లో ప్రయాణిస్తున్నాడు .బోగి లో అందరు నిద్ర పోతున్నారు .చింతలపల్లి అనే చిన్న రైల్ వే స్టేషన్ లో రైల్ ఆగింది .అందమైన అమ్మాయి రైల్ ఎక్కింది .వరుణ్ ఎదుట సీట్ లోనే కూర్చుంది .ఒకరికొకరు పరిచయమయారు .గంట లోనే వారు ప్రేమలో పడ్డారు ."నాకు దెయ్యాల కథలంటే ఇష్టం నేకు ఇష్టమేనా?" అని అడిగింది సారిక .
"ఇష్టమే గని దెయ్యాలను ఎప్పుడు చూడలేదు " అన్నాడు వరుణ్ .
"గంట క్రితమే నువ్వు దేయ్యని చూసావ్ "అన్నది సారిక .
"నువ్వు జోక్ చేస్తున్నావ్ డియర్ ...."అన్నాడు నవ్వుతు వరుణ్ .
"జోక్ చేయడం ఏంట్రా ఫూల్ ?నన్ను చూసావా లేదా ?"
బయనకంగా అరిచింది సారిక .వరుణ్ షాక్ తిన్నాడు .మరో షాక్ ఏమిటంటే గులాబీ చుడిధార్ లో కనిపించిన సారిక తెలుపు రంగు లోకి మరిపాయింది .నోట్లో నుంచి నాలుక బయటకి వచ్చింది .కళ్ళు చింత నిప్పుల్ల మెరుస్తున్నయ్ .పదాలు వెనిక్కి తిరగాయ్ .
'వామ్మో ' అరిచాడు వరుణ్ .ఈ దెబ్బకు నిద్ర పోయిన వాళ్ళంతా లేచారు .దెయ్యం మాయం ఐపోయింది !"
"కథ బాగుంది కానీ నమ్మశక్యం గా లేదు అన్నాడు" అరుణ్ .
"ఎందుకు నమ్మవ్ రా ఫూల్ ? నే ముందు ఉన్న ఈ హరికే ఆ సారిక " అంటూ బయనకంగా నవ్వడం ప్రారంబించింది హారిక ".కాళ్ళు వెనిక్కి తిరిగాయి .నాలుక బయటకి వచ్చింది .
'వామ్మో ' అని గట్టిగ అరిచాడు అరుణ్ .సడన్ బ్రేఅక్ వేసినట్టు రైల్ ఆగిపోయింది .
మోరల్ :టైం పాస్ కోసం ప్రేమలో పడకూడదు
         టైం చూసి ప్రేమలో పడాలి .

Monday, June 25, 2012

దేవత అనుకుంటే పొరపాటే

జీవితం లో ప్రతి మనిషి కి ఏదో ఒకసారి మనసు కు గాయం అవుతుంది, అలా అవడానికి చాల కారణాలు ఉంటే ........అందులో అమ్మాయి ముఖ్య  కారణం అవుతుంది.ప్రతి మనిషి తన వ్యక్తిత్వం మీద తన గురించి తను అవగాహనా లేకుండా మాట్లాడుతూ ఉంటాడు .అలా మాట్లాడడానికి వాడికంటే పక్కవాడికి ఎక్కువ తెలుసు అనుకోని ,వీడు కూడా వాడికంటే ఎక్కువ నాకే తెలుసు అనే బ్రమలో ,వీడు ఏదో చేయాలి అని తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటాడు .అలా వాడి గురించి వాడు తోపు అనుకోని ...ఒక అమ్మాయి విషయం లో అడ్డంగా బుక్ ఐన మా ఫ్రండ్ గాడి  గురించి చెప్పాలి .
మేము కాలేజీ లో జాయిన్ ఐన తర్వాత అందరం అందరితో కలిసి ఉండేవాళ్ళం .అయితే మా అందరిలో మావాడు మత్రం కొంచెం తేడా,వాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు ,వాడి ద్రుష్టి లో నాకే అంతా తెలుసు అనే ఒక రకమైన అహం వడిలో ఎప్పుడు కనిపించేది .వాడు అమ్మాయిల విషయం లో కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు .అలంటి వాడు ఒక అమ్మాయి విషయం లో మాత్రం ఎప్పుడు తను చెప్పిందే వినే వాడు ,తను ఎలా అంటే విడు అలా అనేవాడు .తను వీడిని పూర్తిగా మార్చేసింది ,అనుకునే లోపే విడు తనను మార్చేసాడు ,అంటే ఇంకొక అమ్మాయి ని చూసుకున్నాడు ,అంటే విడు ఏంటో అ రోజు నాకు కొంచెం అర్ధం అయింది ,వీడు మారడు ,అవసరం అనుకుంటే ఎదుటివారిని సైతం వాడి రూట్ లో కి తెచుకుంటాడు ,అంత తెలివిన వాడిని నని వాడికి వాడి ఫీలింగ్ .
కానీ ఎ రోజు వాడి ఆలోచనలు ఇతురలకి అసలం అర్ధం కనివకుండా చేస్తూ ఉంటాడు ,అలంటి వాడిని ఎంతో మంది తిట్టుకుంటారు ,కొంతమంది వీడే గొప్ప తెలివైన వాడు అనుకుంటుంటారు ,నేను మాత్రం ఏమి అనుకోలేని పరిస్థితి .ఎందుకంటే ఇంత చెపిన నేను విడి గురించి ఏమి చెప్పానో కూడా క్లారిటీ లేకుండా చెప్పను గా ,ఇలానే ఉంటాడు వాడు ఎక్కడ క్లారిటీ దొరకుకుండా ..వాడిని చూసినప్పుడల్లా నా క్లారిటీ కూడా నాకు మిస్ అవుతుంటుంది .
వీడికి ఇంకో మంచి అలవాటు కూడా ఉంది ఎవరితో కూడా 1 ఇయర్ కంటే ఎక్కు ఫ్రండ్ షిప్ ఎందుకంటే ...కొత్తదనం కోరోకవాలి కదా అంటాడు .ఇంతటి విచిత్రమియన్ వీడికి లైఫ్ లో ఫస్ట్ టైం వేడిని ఎధవని చేయడానికే పుట్టినట్టు ,వీడితో మంచిగా ఉన్నట్టు నటించి ఇలాంటి ఈ తిక్కలోన్నే పిచ్చి పట్టించి ,తన వెంట తిరిగేల చేసుకుంది .వంద ఏనుగులు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చి నట్టు మా వాడు తన చేతిలో బలి అయి సంకనాకి పోయాడు ,తనని వీడు దేవత లా అనుకుంటే తను వీడి పట్ల దెయ్యం గ మారింది .అందుకే ఎలాంటి వాడు ఐన ఒక అమ్మాయి ముందు ఎదవా అవ్వలిసిందే ,మనం కకపొఇన వాళ్ళు చేస్తరంతే ................

Saturday, June 23, 2012

చదువు రాని వాడవని దిగులు చెందకు  ... మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు ....
మంచు వంటి మలె వంటి .... మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులేందుకు ....

ఏమి చదివి పక్షులు పైకి ఎగుర గలిగెను ...
ఏ చదువు వాళ్ళ చేప పిల్ల ఈద గలిగెను ...
అడవిలోన నెమలి లేవదు పాట నేర్పెను
కొమ్మ  పైని  కోకిలమ్మ కి ఎవడు  పాట నేర్పెను 
నేను కళలు కనే కళ్ళు నావి ,
   కాని కనే కళలు మాత్రం నీవి .

Wednesday, June 6, 2012

ఓ.. ప్రియా .....

ప్రతి రోజు నీ గురించి ఆలోచిస్తూ ,నన్ను నేనే  మరిచాను ప్రియ ,
ప్రేమ అనే మాట నువ్వు చెప్తావని ,కలలో నన్ను నేను ఉహించుకుంటున్న ,
నీ రాక కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్త ,
నువ్వు నవ్వుతూ ఉంటె నిన్ను అలాగే చూడాలని ఉంటుంది ,
నువ్వు అలిగిన క్షణం నా మనసు బాధపడుతుంది ,
నువ్వు నవ్వుతో అడిగితే నా ప్రాణం ఇవ్వడానికి కూడా సంకోచించాను ,
నీ  నవ్వు అంటే నాకు అంత ఇష్టం  ,
నీ నవ్వు కోసం నేను ఏదైనా చేస్తా ,నీ నవ్వు కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటా ,
మరో జన్మలో నాకు తోడుగా నువ్వు ఉంటానంటే ,ఈ క్షణమే నా  ఉపిరి వదిలేస్తా ,
మరుజన్మలో నీకు తోడుగా ,నీ ప్రేమను పొందుతా ....

నిన్నటి రోజు నా  లైఫ్ లో మరచిపోని రోజు ,ఎందుకు అనుకుంటున్నారా నాకు నిన్న ఒక  ఫ్రెండ్  కలిసింది ,తను కలిసాక న లైఫ్ లో నేను ఎప్పుడు లేనంత ఆనందగా ఉన్నాను .కానీ నాకు ఆ సంతోషం ఆ ఒక్క రోజుకే పరిమితం అవుతుంది అని నేను అప్పుడు ఆలోచించలేదు ,కానీ నేను ఎప్పుడు లేనంతగా బాధ పడిన సందర్బం అది ,ఎందుకంటే నాకు ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉండడం ఇష్టం ,అలాంటి నన్ను తను ఈ రోజు నన్ను చాల బాధ పడేలా చేసింది . ఇది నాకు మాత్రమే జరిగింది అని నేను బాధ పడుతున్న ,ఈ పోస్ట్ కూడా అదే బాధతో రాస్తున్న .
కానీ నాకు తనతో మాట్లాడుతున్న అంత సేపు నేను ఎంతో కొత్తగా లైఫ్ లో ఏదో సాదించినట్టు ఉంది ,కానీ ఈ రోజు నాతో మాట్లాడక పోయే సరికి నాకు తన గురించి తప్పుగా ఆలోచించాలి అని కూడా అనిపించట్లే ,ఇది నాకు తనపై ఉన్న ఇష్టమే కావొచ్చు ,నన్ను అలా ఆలోచించకుండా చేస్తుంది .తను నాతో మాట్లాడడానికి నేను కారణం అడగలేదు ,ఇప్పుడు నాతో మాట్లాడకపోవాడికి నేను కారణం అడగలేకపోతున్న .

ఒక అమ్మాయి ఒక్క రోజు పరిచయం నన్ను ఇంతల ప్రభావితం  చేస్తుంది అని నేను ఎప్పుడు ఉహించలేదు. అ అమ్మాయి గురించి కూడా ఆలోచించని నేను తనకోసం ఇంతల బాధపడాడడానికి కారణం ఏంటో అర్ధం కావట్లేదు ,అలాగని మా ఇదరి మధ్య ఉంది ప్రేమ అంటే అది కాదు .తానంటే నాకు ఇష్టం అది మాత్రం అర్ధం అవుతుంది కానీ తనతే ఎందుకు ఇష్టం అనేది మాత్రం అర్ధం అవట్లే .తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా .తను చూసినప్పుడల్లా నేను అ బాధను తట్టుకులేనమో అని అనిపిస్తుంది .

నా  మనుసుకు అంత గా తను ఎందుకు దగ్గర అయిందో ,ఇప్పుడు అదే మనసును బాధపెడుతూ దూరంగా ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్ధం అవట్లే . ఎ రోజు ఐన మల్లి నాతో తను మాట్లాడితుందో ,లేదో తనకోసం న కలలో కూడా ఎదురు చూస్తూ ఉంటాను . కలలో తను నాది అనుకుంటూ ఉంటాను ,కానీ నిజ జీవితం లో తను నా కలగానే మిగిలిపోతున్దేమో .............................

నా గుండెను కోసి దూరంగా వేల్లిపోయావ్ ..
నువ్వు లేకుంటే నేను బ్రతికేది ఎలా ..

Monday, June 4, 2012

పుస్తకం

శిలఫలకనివై
తాళ  పత్రనివై
రాగి రేకువై ఎతవేన్నో అవతారాలు
కాగితనివై కళ్ళు తెరిచి
విశ్వ మానవాళికి అందించావ్
విజ్ఞానగనులు

ఇంటి నడుమైన
ఇంటర్నెట్ ఐన
పుస్తకం ఉంటేనెగ ఫీడింగ్
ఎ రాత రాయాలన్న ఉండాలిగా రీడింగ్
వెండితెర వ్యమోహలనుండి
వెకిలి ఛానల్ ల వ్యాపార ధోరణుల నుండి
చీప్ ప్రచురునల చిం బుతల నుండి
పరుగున వచ్చే పాటకులకోసం
గ్రంధాలయాల్లో కొలువై
జాతీయ పుస్తక నిధుల్లో నిక్షిప్తమై
నిరీక్షించే పెన్నిదివి
బుక్ షెల్ఫ్ లో నుండి
'బుకర్ ' బహుమతి బురుజుల ఫై ఎగిరే
ప్రింట్ మీడియా జయకేతనం పై  నిలిచిన
ప్రతిష్టాత్మక విజయ చిహ్ననివి !
సమస్తానివి !
మంచి పుస్తకానివి !!

చేదు పాట

లేదు సుఖం  లేదు సుఖం ,
లేదు సుఖం జగత్తులో !
బ్రతుకు వృధా , చదువు వృధా ,
కవిత వృధా !వృధా ,వృధా !
నిజం సుమీ నిజం సుమీ
నీవన్నది నిజం సుమీ  !
బ్రతుకు చాయ , చదువు మాయ 
కవిత కరక్కాయ సుమీ !

శ్రమ అనేది మెట్లు లాంటిది ,అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది ..అప్పుడప్పుడు లిఫ్ట్ పనిచేయకపోవాచు కానీ మెట్లు అనేవి శాశ్వతం.....
                         

Saturday, March 24, 2012

నా జీవితం లో అడ్డొచ్చిన ప్రతి అడ్డమైన కుక్కకీ సమాధానం చెప్పుకుంటూ పోయి నా లక్యాన్ని దూరం చేస్కోను ..

I will throw some biscuits and Move on !!!

Saturday, March 10, 2012

దమ్ము

నాలాంటి వాడిని ఎప్పుడు కేలకొద్దు ........పొరపాటున కేలకవో ..........చరిత్రలో కానీ వినీ ఎరుగని రీతిలో క్రైం రేట్ పెరిగిపోద్ది .......

Sunday, March 4, 2012

లేచింది మహిళా లోకం @ 2112

అది 2112 వ సంవత్సరం .మహిళలు పూర్తిగా ఆధిపత్యం ఉన్న రోజులు .33% రిజర్వేషన్ నుండి 75% రిజర్వేషన్ పొందారు .మగ వాళ్ళు ఒంటరిగా తిరగలేని రోజులు .మగ వాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితమయ్యారు .ఆ రోజుల్లో ముడ నమ్మకాలూ కూడా ఎక్కువ . చిన్న తనం లోనే మగ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు .మగ వాళ్ళను చిన్న తనములోనే చంపెసేవారు .అది చివరికి ప్రతి ఏట జరిగే స్రీ, ,పురుష నిష్పతి లో చాల తేడా వచేసింది .1000 మంది ఆడవాళ్లకు 500 మంది మాత్రమే మగవాళ్ళు .దిని గురించి ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేయడం మొదలు పెట్టారు .కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన పురుషుల సంఖ్యా ను పెంచ లేక పొయింది .అప్పుడు ఆడవాళ్లు చనిపోతే వాళ్ళతో పటు మగవాళ్ళను చంపే వాళ్ళు దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు పతి సహగమనం .మగ వాళ్ళ ఫై ఆడవాళ్లు పూర్తి ఆధిపత్యం చేయడం మొదలు పెట్టారు .కనీసం ఆడవాళ్లు తోడు లేకుండా మగ వాళ్ళు బయటకి కూడా వచేవారు కాదు . మగ వాడు అర్ధరాత్రి బయట తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు ,పాపం అప్పట్లో చుట్టూ పక్కల ఉన్న మగ వాళ్ళంతా కలిసి మాట్లాడుకునే వారు .వాళ్ళ కోసం కుదెవరో ఒకరు వచ్చి వారి కోసం పోరాటం చేయకపోతారా అని ఎదురు చూస్తున్న రోజులు ,అప్పుడు వాళ్ళకు అండగా ఎంతో మంది ఆడవాళ్లు నిలబడ్డారు ,ఎలాగైనా మగ వాళ్ళకు వంటింటి నుండి విముక్తి కలిగించాలి అని ,ఎన్నో ఉద్యమాలు చేసారు .కానీ వీటి వాళ్ళ వాటికీ ఎటువంటి ఉపయోగం లేక పొయింది .ఒక్క సరి గతం లోకి వెళ్లి చూసుకున్నారు ,ఒకప్పుడు మనం చెప్తే విన్న వాళ్ళు,ఇప్పుడు మన ఫై ఇంత తిరగాపాడడానికి కారణం ఏంటి అని ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు .అప్పుడు వాళ్ళకు మెదడు లో ఒక అలోచన తట్టింది ,2014 వ సంవత్సరం మనం అందరం కలిసి ఆ మహిళా బిల్లు ను ఆమోదించా కుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచెది కాదు గ అని ప్రతి ఒక్కరు బాధపడడం మొదలు పెట్టారు ,కానీ అంత బాధలో కూడా వాళ్ళకు మాత్రం ఒక ఆనంద కరమైన విషయం ఏంటంటే ,అది అంత వాళ్ళ కల అని ,కలలో జీవితాన్ని ఒకసారిగా ఉహించుకున్న వాళ్ళకి ,జీవితం లో ఇలాంటిది రాకుడదని రోజు అనుకుంటూ జీవిస్తున్నారు ........

Saturday, February 18, 2012

అందమైన కల(చెడింది )

మనాలి , ఎంత  చల్లగా  ఉందో ...ఒక  కొండ  అంచు  మీద  కూర్చొని  వేడి   గా  టీ  తాగుతున్న ....ఛార్మి పక్కనే  ఉంది ... ...ఎంత  అందంగా  ఉంది  అసలు ...చా .......ఇంతలో  కాలు  జారి  కొండ  లోయలోకి   పడిపోయా .......అప్పుడే   మేలుకువోచి  చూస్తే ....
ఎదురుగా ఒక ఎలుగుబంటి తెలుగు లో మాట్లాడుతూ కనిపించింది ,ఎంటబ్బ ఎలుగుబంటి తెలుగు లో మాట్లాడుతుంది అనుకోని కొంచెం అటు ఇటు తిరిగి చుస్తే వాడు మా ఫ్రెండ్ .అప్పుడు అర్ధమైంది (ఐన ఎలుగుబంటి కి తెలుగు రావడమేంటి విచిత్రంగా ).
అందమైన కల మధ్యలో నే ఆగిపాయింది అని బాధపడుతూ ,కాలేజీ కి పోదాం అని రెడీ అయ్యా ,అప్పుడే ఎదురయ్యాడు మా లెక్చరర్ "కుళ్ళిపోయిన కాకరకాయ మొకం వేసుకొని ", అబ్బ ఎ దరిద్రుడు ఎదురోచాడు ఏంటి ర అనుకున్న ,రావడం తో నే అడిగాడు assignment ఎక్కడ అని "జేబులో ఉంది రా " అని చెప్పాలనుకున్న కుదరదు గా వాడి క్లాసు "కాబట్టి ఎవడి క్లాసు కి వాడె తోపు అనమాట " అనుకోని తెచాను అని చెప్పను .
కాలేజీ లో ఉన్న అందరి ధరిద్రుల్లో కల్లా వీడు  కొంచెం వెరైటీ అనమాట , ఏది రాసిన కోతగా ఉండాలి అంటాడు ,వాడి ముచట నేను ఎందుకు కాదనాలి అని నేను వెరైటీ గా , వాడు ఇచిన questions కి కాకుండా నాకు నచిన ఒక నలుగు కొత్త questions కి answers రాసిచ్చ.నాలో ఉన్న ఇంత వెరైటీ ని తట్టుకోలేక బయటకి పంపించాడు ,చెప్పాడు కదా అని బయటకి వెళ్ళా .
ఎలాగోలా ఐపోయింది అ రోజు ,ఇంటికి వెల్దం అని బయటకు వచ్చా ,ఇంతలో మా HOD చూసి ఎక్కడికి బాబు అని అడిగాడు ".......పక్కనే  ఉన్న  మురిక్కలవలో  నీ  పిండం  పెట్టటానికి  అందం  అనుకున్నాను  కానీ  కుదరదు కదా  ....." లెక్చరర్ బయటకి పంపాడు ,నేను మోతనికే బయటకు పోతున్న అని చెప్పా .
వాడికి ఎం అర్ధమయిందో (ఎందుకంటే వాడికి తెలుగు సరిగా అర్ధం అవ్వదు ) ,గో అన్నాడు.చెప్పాడు కదా అని వెళ్ళిపోయ ,బయటకి రాగానే రిజల్ట్స్ వాచి అని ఒక చెప్పారు,తు దినమ్మ జీవితం అనుకున్న ,ఏమయ్యాయో ఏంటో ఏంటో అని తెలుసుకుందాం అని లోపలి వెళ్ళా ,అందరు వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ అడిగి వెళ్తున్నారు ,ఒక్కో మొకం ,ఒక్కోల ఉంది ,నాకేమో భయం అవుతుంది ,(ఎందుకంటే నా మీద నాకు చాల కాన్ఫిడెన్సు అనమాట కచితంగా ఏదో ఒకటి పోయి ఉంటుంది అని ),అనుకున్నట్టే అయింది ,రెండు ఎగిరి పోయాయి ,పోయిన వాటిని మల్లి పిలిస్తే రావు గా ,ఎం చేస్తాం లే అని వదిలేస .
వెళ్లి క్లాసు లో కూర్చున్న ,పాపం ఒక్కోడు ఒక్కోల మొకం పెట్టుకొని కూర్చున్నారు ,జీవితం మొత్తం సంకనాకి పొయింది అన్నట్టు పెట్టారు ఒక్కో పేస్ .
ఎవరికీ వారు వెళ్ళిపోయారు (పాపం బాధను తట్టుకో లేక నేమో ) ,నేను మాత్రం ఏదో జీవితం సాదించిన వాడి లాగా ఎక్కడ బాధపదనట్టు ,చాల వరకు మేనేజ్ చేశా ,ఎం చేస్తాం ఎవరికైన బాధ ఉంటుంది కదా నాకు ఉంది ,
"కానీ ఒకటి మాత్రం అనిపించింది నాకు తెలియని దాని గురించి నేను తెలుసుకోవడం లో కొన్ని సార్లు ఓడిపోవాచు కానీ జీవితం లో  ఎప్పటికిన నేను  గెలుస్తాను అనే నమ్మకం నాకు ఉంది "
హమ్మయ ......మొత్తానికి చెప్పేసాను .
నా కల చివరికి నన్ను అ రోజు కి అలా  చేసేసింది ...............

నా ప్రేమా ........


  • "నా జీవితం  లో  ని పరిచయం  అప్పుడే  భూమి  ని  చేరిన  వర్షం  చినుకు లాంటిది ,
    దాని నుండి వచ్చే వాసనా ఎంత స్వచ్చ మైనదో నేను నీ   ఫై చూపించే ప్రేమ అంత స్వచ్ఛమైనది "
    "సూర్యున్ని చూడగానే పువ్వు ఎలా పరిమలిస్తుందో ,
    నిన్ను చూడగానే న మనసు నీ వైపు తిరుగుతుంది "

నమ్మకం .......

జీవితం లో నమ్మకం నమ్మరని నిజం నమ్మితే నాశనం నీ జీవితం

Monday, February 13, 2012

ఎందుకో .............

కావాలనుకున్న  ప్రేమనే

కావాలని  చేరిపా  దానినే
నేనేం  చేస్తున్న  మంచిని
మన్నించవ  నీ  చెలిని …

నిజంగా  నిజాన్ని  ఇదంటూ  తెలుపగా  లేను  అని
భరించ  విషాన్ని ప్రియ  నికోసమని
నా  ప్రానములోన  ప్రాణంల  నిలిచిపోయావే  ప్రేమ

ఈ  నిముషాన  నీ  హృదయంలో  నేనే  లేనంటే  నమ్మేదెల 

Friday, January 27, 2012

63 సంవత్సరాల గణతంత్ర దేశం

మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకుని 62 సంవత్సరాలు పూర్తి  చేసుకున్న ,అయిన ..... మనం మాత్రం ఇక్కడే ఉన్నాం .కుల పిచ్చిని కాలరాద్దామన్న అంబేద్కర్ విగ్రహాన్ని చిన్నబిన్నం చేసేంత పరిణితి వచ్చింది మనలో ,రాకెట్ యుగం లో కి ఎంట్రీ ఇచ్చిన రాతి యుగపు మన అలవాట్లు జేబుల్లో పెట్టుకు తిరుగుతున్నాం అనటానికి ఈ విగ్రహ ద్వంసం ఒక్కటే హేతువు కాదు .

భానిసత్వం సంకెళ్ళను పెల్లగించుకున్నామని ,స్వేచ్చను పొందామని,భారతమాత వ్యక్తిత్వం నిలబెట్టుకున్నం అని సగర్వంగా పాడుకోవడానికి చాలానే దేశ భక్తి గీతలు ఉన్నాయ్ ,అ స్వేచ్చ అనబడే మానవీయ అవసరం ఎందరి దగ్గర బద్రంగా ఉంది ,అండమాన్ దీవులలోని జడావ  తెగలను నగ్నంగా నిలుచోబట్టి డాన్సు లు వెయిచ్చి, అందులోని వినోదాన్ని వెతుక్కుని పసందైన పర్యాటకులు మన భారతియులే ,అ విధంగా సాటి మనిషిని భారతియుడు ఎ విధంగా చూస్తున్నాడు అనేదానికి ఇదొక నిలువెత్తు సాపత్యం .మనల్ని మనం వినోద పరికరాలుగా ప్రెసెంట్ చేసుకొని ,ఆనంద పడిపోతు  పనిలో పనిగా ,విదేశీ పర్యాటకుల నుండి సొమ్ములు కూడా దండుకుంటన్నాం .ఒరిస్సా లో ఒక తెగ వాళ్ళని బ్రిటన్ నుండి వచ్చే పర్యాటకుల కోసం ,వీళ్ళని నగ్నంగా నిల్చో బెట్టి parade చేసి చూపించడం tourist కంపని ఇస్తున్న స్పెషల్ package.ఇందుకోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన  వీళ్ళ తెగిoపుకు గర్వపడాల ,సిగ్గుపడాల .అడవుల్లో పుట్టి,అడవుల్లో పెరుగుతున్న ఈ తెగ వాళ్ళు కూడా మన సర్వ సత్తాక   గణతంత్ర దేశానికి చెందిన సగటు భారతీయులే .నాగరికత తెలియకపోవడం వాళ్ళ తప్పుకాదు ,కనీసం బట్టలు లేకుండా తిరగాకుడదు అన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళు చేసిన నేరం కాదు ,కడుపు నింపుకోవడం వాళ్ళు ఇలా చేయాల్సి రావడం వాళ్ళ కర్మ కనీ ,వాటిని ఎగోదోసిన పాపం నేటి భారతీయులుగా మనది కాదా.
 ఏమి తెలియని వాళ్ళంటే వదిలేద్దాం ,ఎంతో నాగరికత సంపాదించినా మనం ,కుల మత బాషలికి అతీతంగా ఉన్న మన దేశం లో గడిచిన 62 సంవత్సరాలలో 482 చోట్ల మత పరమైన అల్లర్లు ,విద్వంసాలు ,బాంబు పేలుళ్లు జరిగితే ,13 వేల మంది నెత్తురు చిందించి నెల కులినట్టు ఆధారాలు  ఉన్నాయ్ .లక్ష 82 వేల కోట్లు దాటిన రక్షణ బడ్జెట్ కూడా ... మనకు కనీస బద్రత కల్పించాలేకపోతుంది...
 ఇప్పటికి దేశం లో 53 కోట్ల మందికి ఆకలి అనేది తీరని కోరిక ,ఒక్క పూట తిండి తో సరిపెట్టుకుంటున్న వాళ్ళు ఇంకెందరో ,ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ,పేదవాడు మాత్రం అలాగే ఉండిపోవటం మనం ఇప్పటికి చూస్తున్నాం ,ఆ పేద వాడు ఉన్నదీ కూడా ఈ మన గణతంత్ర దేశం లోనే .60 సంవత్సరాలుగ డెవలప్ అవుతున్నాం అంటున్నాం కానీ ఎప్పటికి డెవలప్ అయ్యం అని చెప్పుకుంటాం తెలియదు .
 మనకంటూ మనం ఉపయోగించుకునే ఓటు హక్కు కూడా డబ్బులకు ,మందు బాటిల్ లకు అమ్ముకున్తున్నది కూడా మనోబోటి సగటు భారతియుడే .ఎన్నికల సమయం అంటే ఆహార పొట్లాలు ,మందు బాటిల్ లు ,డబ్బులు పంచడం అనే ఒక విపరీతమైన ట్రేడ్ నడుస్తుంది కూడా మన ఈ గణతంత్ర దేశం లోనే .మనం ముందుకు నడుస్తున్నామ లేక వెనక్కు నడుస్తున్నామ అనే సందేహం ఎ గణాంకాలు చూసాక మనల్ని దెప్పి పొడుస్తుంది .260 central labs,300 universitilu,20 వేల college లు , 30 వేల  మంది సైంటిస్ట్ లు ఉన్న పుష్టి కరమైన దేశం గ ఇండియా కు పేరుంది కాని ,సైన్సు లో మాత్రం మనకు నోబెల్ సాదించి  పెట్టింది  cv raman అనే ఒకే ఒక్క సైంటిస్ట్.ఇంత మంది ఉన్న ఎందుకు తెచ్చుకో  లేక పోతున్నాం ? మన ఇండియా లో ఎక్కడ లేనంతగా నల్లదనం మనం పోగు చేసుకున్నాం ,అవినీతి బాగా అలవాటు పడిపోయిన మనం ఎన్నికల సమయం లో నాయకులూ ఇచ్చే హామీలతో సోమరి పోతులుగా మరిపోతున్నాం . అన్ని మనకి తెలిసి చేస్తున్న మనకెందుకు అని అనుకువడం మన దేశం లో ఉన్న వ్యక్తుల లక్షణం .దేశం ఎలా అయిపోయిన మనం మాత్రం బాగుంటే సరిపోతుంది కదా అనే గణతంత్ర దేశం లో ఉన్నాం .రూపాయ్ విలువ ఎప్పుడు పడిపోతుందో అని బయపెడుతూ ఉంటె ,ఎప్పటికప్పుడు పరిగిపోతు ఉండే కుంబ కోణాలు మనల్ని ఇంకా ఇలానే ఉండేలా చేస్తున్నాయ్ ,అందుకే మనం ఇంకా ఇలానే ఉన్నాం ,దొరికిన వాళ్ళను జైలు లో పెట్టి వాళ్ళను మేపడం తప్ప మనం చేయ గలిగింది  ఏమి లేదు ,కనీసం 2020 కన్నా ఇండియా అబివ్రుది చెందిన దేశం గ మనం చూస్తామ ,ఏమో అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేమ? 
కనీసం మన ఓటు హక్కు నైన మనం సద్వినియోగం చేసుకుందాం ,మనవంతు బాద్యత గ సాటివాడికి సహాయపడుదాం .ఎ విషయం ఐన మనకెందుకు అని కాకుండా మనకోసం అన్నట్టుగా అలోచ్చిద్దాం ,మన దేశాన్ని బావి తరాలకు ఒక ఆదర్శంగా తీర్చి దిద్దడం లో మన వంతు బాద్యత నిర్వర్తిద్దాం .

Thursday, January 26, 2012

తొలిసారి నిన్ను చూసినప్పుడు నీ అంత అందగత్తె ఇంకెవరు లేరు అనుకున్న,
మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు నీ  అంత బాగా ఎవరు మాట్లాడారు అనుకున్న ,
చివరిసారిగా నేను నీకు ఐ లవ్ యు చెప్పినప్పుడు , నువ్వు i hate you అన్నావ్ ,
అప్పుడు తెలిసింది నీకు బుద్ధి లేదు అని , అందుకే చూసుకున్న ఇంకొక దాన్ని ,
అప్పుడు అర్ధమైంది నాకు ప్రేమ గుడ్డిదని .........

Saturday, January 21, 2012

పైకి చెప్ప 'లేఖ '

ఒక చక్కని కుర్రాడు ......... ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు . కానీ తన ప్రేమను చెప్పే ధైర్యం చేయలేక పోయాడు .
ఆ అమ్మాయి ఆ అబ్బాయి కాలేజీ పక్కనున్న సీడీ షాపులో పనిచేసేది . ఆమెను చూడటం కోసం అతడు రోజు అక్కడికి వెళ్ళే వాడు , అవసరం లేకున్నా ఏదో ఒక సీడీ కొనే వాడు . చూపుల ద్వార ,చర్యల ద్వార తన ప్రేమను వ్యక్తపరిచే  వాడు .ఆమె ఎప్పటికైనా అర్ధం చేసుకోపోతుంద అని ఎదురు చూసే వాడు .

కనీ ఆమె నుండి ఎటువంటి ప్రతి స్పందన కనిపించలేదు . దాంతో తనలో తనే మధనపడ్డాడు . కుంగి పోయాడు . ఇక ఆ సీడీ షాప్ కి వెళ్ళడం మానేశాడు .
      రొజూ వచ్చే కుర్రాడు రాకపోవడం తో ఆమె అతడి కోసం వెతికింది .ఇవ్వాళా కాకపోతే రేపు ఐన వస్తాడేమో అని ఎదురు చూసింది .
ఎంతాకి రాకపోవడం తో అతడి అడ్రెస్స్ కనుక్కొని ఆశగా అతడి ఇంటికి వెళ్ళింది .ఇంట్లో అడుగుపెడుతూనే దండ వేసిన అతడి ఫోటో చూసి అవాక్కయ్యింది .తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను గ్రహించ లేదన్న బాధతో ఆత్మ హత్య చేసుకున్నాడని అతని తల్లి చెప్పిన మాట విని హతాశురాలుయ్యింది . అతడిని చూసే అవకాశం ఎలాగు లేదు , కనీసం ఒక్కసారి తన గది చూడొచ్చా అని అడిగింది , తల్లి సరేనంది .
        అతని గది లోకి అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయీ .ఆ గది నిండా సీడీ లే . సీడీ ర్యాక్ లో , టేబుల్ మీద ...... ఎక్కడ చూసినా సీడీ లే . మెల్లగా వెళ్లి ఒక సీడీ చేతిలోకి తీసుకుంది . వణుకుతున్న చేతులతో అన్ని సీడీ కవర్ లను తెరిచింది . వాటిని ప్యాక్ చేసి ఇచ్చే తప్పుడు అందులో తను వేసిన కాగితాలు అన్నిటిని కుప్పలా పోసింది . ప్రతి కాగితం మీద ఆమె  రాసిన మూడు అక్షరాలు ఆమెను వెక్కిరిస్తుంటే  ఏడ్పు ఆపుకోలేక కుప్పకూలిపోయింది . ఆ మూడు అక్షరాలు 'ఐ లవ్ యు '!
"నిజమైన ప్రేమ దెయ్యం లాంటిది . దాని 
            దాని గురించి మాట్లాడుకునే వారు తప్ప,
                                        చుసిన వాళ్ళు చాల తక్కువ !"
                     

Wednesday, January 18, 2012

 పిచ్చుక.....నా చిన్ననాటి స్నేహితుడు...మా ఇంటి కరెంటు మీటరు మీద వాలటానికి వచ్చినప్పటినించి పరిచయం...!! రోజు ఉదయం పదింటికల్లా వచ్చి వాలిపోయేవాడు...కిచ్ కిచ్ మంటూ సైగ చేసేవాడు..!! బుజ్జి బుజ్జి రెక్కలు ఆడిస్తూ అల్లరి చేసేవాడు...అటు ఇటు గెంతుతూ ఆడుకునేవాడు..!! వాడి అల్లరి చూస్తే ముచ్చట వేసేది...సమయం ఇట్టే గడిచిపోయేది..!! అలా కొన్నేళ్ళు సాగిన మా స్నేహం కొన్నాళ్ళలోనే ముగిసిపోయింది...వాడు రావటం మానేసాడు..నేనంటే ఇష్టంలేక కాదు...ఈ నాగరిక ప్రపంచం సృష్టించిన కలుషిత ప్రపంచంలో శ్వాసించలేక..!! వదిలి వెళ్ళిపోయాడు..నన్ను మాత్రమే కాదు...ఈ లోకాన్ని కూడా..!! వాడి చిట్టి పొట్టి పాదాల సడిలేక కరెంటు మీటరు బోసిపోయింది..గడియారం చిన్న ముళ్ళు పది దగ్గర ఆగిపోయింది..!! నా గొంతు మూగబోయింది..!! ఒక నిజం ఆధునిక ప్రపంచపు అడుగుల క్రిందపడి నలిగిపోయింది..!! పిచ్చుక చచ్చిపోయింది..!!