కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Friday, March 13, 2015

జ్ఞాపకాలు...

గడిచిన కాలం లో జరిగిన విషయాలే ,
జారుతున్న కలం లోని అక్షరాలు... 
నడిచిన దూరం లో కరిగిన దూరాలే,
తడిసిన కళ్ళలో జారిన స్నేహాలు... 
నిజాలు చేదుగా ఉంటాయి.. 
జ్ఞాపకాలు భారం గా ఉంటాయి... 

Thursday, November 6, 2014

నువ్వు జాబిల్లి ఒకటే

నువ్వు జాబిల్లి ఒకటే ... చూడగలను కానీ చేరుకోలేను .... 

Tuesday, November 4, 2014

సముద్రాన్ని చూస్తే అలలు

సముద్రాన్ని చూస్తే అలలు ... అమ్మాయిని చూస్తే కలలు మిగులుతాయి ..... 

Tuesday, September 9, 2014

నీ నవ్వు ఒక ప్రశ్న ...

నీ నవ్వు ఒక ప్రశ్న ... నా నవ్వు ఒక సమాధానం .. ఇది మన సంభాషణ ... :) :)

Tuesday, June 10, 2014

ఆకాశం లోని మేఘానికి తెలుసు...

ఆకాశం లోని మేఘానికి తెలుసు...
తను ఏ రోజుకైనా కరిగి పోతుందని..
జలపాతం లోని నీటికి తెలుసు...
తను ఏ రోజుకైనా ఆవిరై పోతుందని..
కానీ...

ఈ నా హృదయానికి మాత్రమే తెలుసు...
నీ మీద ప్రేమ ఏనాటికీ చెరగదని.... 

నిను వీడిన క్షణం నేను లేను.....

నిను వీడిన క్షణం నేను లేను....నువు వదిలిన నిమిషం నాది కాదు....
ప్రపంచాన్నే మరిపించే నీ ప్రేమ కోసం...
ప్రేమ అనే పేరుతో....
మనసు అనే లోకం లో...
ప్రాణం అనే ప్రపంచం లో....
ఎన్ని జన్మలకైనా వేచి చూసే నీ......ప్రేమ

నిన్ను వీడి వెళ్ళిపోతున్న.......

నిన్ను వీడి వెళ్ళిపోతున్న కానీ నా  మనుసు నీ చెంత వదిలి వెళ్తున్న .......