కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Friday, January 27, 2012

63 సంవత్సరాల గణతంత్ర దేశం

మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకుని 62 సంవత్సరాలు పూర్తి  చేసుకున్న ,అయిన ..... మనం మాత్రం ఇక్కడే ఉన్నాం .కుల పిచ్చిని కాలరాద్దామన్న అంబేద్కర్ విగ్రహాన్ని చిన్నబిన్నం చేసేంత పరిణితి వచ్చింది మనలో ,రాకెట్ యుగం లో కి ఎంట్రీ ఇచ్చిన రాతి యుగపు మన అలవాట్లు జేబుల్లో పెట్టుకు తిరుగుతున్నాం అనటానికి ఈ విగ్రహ ద్వంసం ఒక్కటే హేతువు కాదు .

భానిసత్వం సంకెళ్ళను పెల్లగించుకున్నామని ,స్వేచ్చను పొందామని,భారతమాత వ్యక్తిత్వం నిలబెట్టుకున్నం అని సగర్వంగా పాడుకోవడానికి చాలానే దేశ భక్తి గీతలు ఉన్నాయ్ ,అ స్వేచ్చ అనబడే మానవీయ అవసరం ఎందరి దగ్గర బద్రంగా ఉంది ,అండమాన్ దీవులలోని జడావ  తెగలను నగ్నంగా నిలుచోబట్టి డాన్సు లు వెయిచ్చి, అందులోని వినోదాన్ని వెతుక్కుని పసందైన పర్యాటకులు మన భారతియులే ,అ విధంగా సాటి మనిషిని భారతియుడు ఎ విధంగా చూస్తున్నాడు అనేదానికి ఇదొక నిలువెత్తు సాపత్యం .మనల్ని మనం వినోద పరికరాలుగా ప్రెసెంట్ చేసుకొని ,ఆనంద పడిపోతు  పనిలో పనిగా ,విదేశీ పర్యాటకుల నుండి సొమ్ములు కూడా దండుకుంటన్నాం .ఒరిస్సా లో ఒక తెగ వాళ్ళని బ్రిటన్ నుండి వచ్చే పర్యాటకుల కోసం ,వీళ్ళని నగ్నంగా నిల్చో బెట్టి parade చేసి చూపించడం tourist కంపని ఇస్తున్న స్పెషల్ package.ఇందుకోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన  వీళ్ళ తెగిoపుకు గర్వపడాల ,సిగ్గుపడాల .అడవుల్లో పుట్టి,అడవుల్లో పెరుగుతున్న ఈ తెగ వాళ్ళు కూడా మన సర్వ సత్తాక   గణతంత్ర దేశానికి చెందిన సగటు భారతీయులే .నాగరికత తెలియకపోవడం వాళ్ళ తప్పుకాదు ,కనీసం బట్టలు లేకుండా తిరగాకుడదు అన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళు చేసిన నేరం కాదు ,కడుపు నింపుకోవడం వాళ్ళు ఇలా చేయాల్సి రావడం వాళ్ళ కర్మ కనీ ,వాటిని ఎగోదోసిన పాపం నేటి భారతీయులుగా మనది కాదా.
 ఏమి తెలియని వాళ్ళంటే వదిలేద్దాం ,ఎంతో నాగరికత సంపాదించినా మనం ,కుల మత బాషలికి అతీతంగా ఉన్న మన దేశం లో గడిచిన 62 సంవత్సరాలలో 482 చోట్ల మత పరమైన అల్లర్లు ,విద్వంసాలు ,బాంబు పేలుళ్లు జరిగితే ,13 వేల మంది నెత్తురు చిందించి నెల కులినట్టు ఆధారాలు  ఉన్నాయ్ .లక్ష 82 వేల కోట్లు దాటిన రక్షణ బడ్జెట్ కూడా ... మనకు కనీస బద్రత కల్పించాలేకపోతుంది...
 ఇప్పటికి దేశం లో 53 కోట్ల మందికి ఆకలి అనేది తీరని కోరిక ,ఒక్క పూట తిండి తో సరిపెట్టుకుంటున్న వాళ్ళు ఇంకెందరో ,ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ,పేదవాడు మాత్రం అలాగే ఉండిపోవటం మనం ఇప్పటికి చూస్తున్నాం ,ఆ పేద వాడు ఉన్నదీ కూడా ఈ మన గణతంత్ర దేశం లోనే .60 సంవత్సరాలుగ డెవలప్ అవుతున్నాం అంటున్నాం కానీ ఎప్పటికి డెవలప్ అయ్యం అని చెప్పుకుంటాం తెలియదు .
 మనకంటూ మనం ఉపయోగించుకునే ఓటు హక్కు కూడా డబ్బులకు ,మందు బాటిల్ లకు అమ్ముకున్తున్నది కూడా మనోబోటి సగటు భారతియుడే .ఎన్నికల సమయం అంటే ఆహార పొట్లాలు ,మందు బాటిల్ లు ,డబ్బులు పంచడం అనే ఒక విపరీతమైన ట్రేడ్ నడుస్తుంది కూడా మన ఈ గణతంత్ర దేశం లోనే .మనం ముందుకు నడుస్తున్నామ లేక వెనక్కు నడుస్తున్నామ అనే సందేహం ఎ గణాంకాలు చూసాక మనల్ని దెప్పి పొడుస్తుంది .260 central labs,300 universitilu,20 వేల college లు , 30 వేల  మంది సైంటిస్ట్ లు ఉన్న పుష్టి కరమైన దేశం గ ఇండియా కు పేరుంది కాని ,సైన్సు లో మాత్రం మనకు నోబెల్ సాదించి  పెట్టింది  cv raman అనే ఒకే ఒక్క సైంటిస్ట్.ఇంత మంది ఉన్న ఎందుకు తెచ్చుకో  లేక పోతున్నాం ? మన ఇండియా లో ఎక్కడ లేనంతగా నల్లదనం మనం పోగు చేసుకున్నాం ,అవినీతి బాగా అలవాటు పడిపోయిన మనం ఎన్నికల సమయం లో నాయకులూ ఇచ్చే హామీలతో సోమరి పోతులుగా మరిపోతున్నాం . అన్ని మనకి తెలిసి చేస్తున్న మనకెందుకు అని అనుకువడం మన దేశం లో ఉన్న వ్యక్తుల లక్షణం .దేశం ఎలా అయిపోయిన మనం మాత్రం బాగుంటే సరిపోతుంది కదా అనే గణతంత్ర దేశం లో ఉన్నాం .రూపాయ్ విలువ ఎప్పుడు పడిపోతుందో అని బయపెడుతూ ఉంటె ,ఎప్పటికప్పుడు పరిగిపోతు ఉండే కుంబ కోణాలు మనల్ని ఇంకా ఇలానే ఉండేలా చేస్తున్నాయ్ ,అందుకే మనం ఇంకా ఇలానే ఉన్నాం ,దొరికిన వాళ్ళను జైలు లో పెట్టి వాళ్ళను మేపడం తప్ప మనం చేయ గలిగింది  ఏమి లేదు ,కనీసం 2020 కన్నా ఇండియా అబివ్రుది చెందిన దేశం గ మనం చూస్తామ ,ఏమో అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేమ? 
కనీసం మన ఓటు హక్కు నైన మనం సద్వినియోగం చేసుకుందాం ,మనవంతు బాద్యత గ సాటివాడికి సహాయపడుదాం .ఎ విషయం ఐన మనకెందుకు అని కాకుండా మనకోసం అన్నట్టుగా అలోచ్చిద్దాం ,మన దేశాన్ని బావి తరాలకు ఒక ఆదర్శంగా తీర్చి దిద్దడం లో మన వంతు బాద్యత నిర్వర్తిద్దాం .

Thursday, January 26, 2012

తొలిసారి నిన్ను చూసినప్పుడు నీ అంత అందగత్తె ఇంకెవరు లేరు అనుకున్న,
మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు నీ  అంత బాగా ఎవరు మాట్లాడారు అనుకున్న ,
చివరిసారిగా నేను నీకు ఐ లవ్ యు చెప్పినప్పుడు , నువ్వు i hate you అన్నావ్ ,
అప్పుడు తెలిసింది నీకు బుద్ధి లేదు అని , అందుకే చూసుకున్న ఇంకొక దాన్ని ,
అప్పుడు అర్ధమైంది నాకు ప్రేమ గుడ్డిదని .........

Saturday, January 21, 2012

పైకి చెప్ప 'లేఖ '

ఒక చక్కని కుర్రాడు ......... ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు . కానీ తన ప్రేమను చెప్పే ధైర్యం చేయలేక పోయాడు .
ఆ అమ్మాయి ఆ అబ్బాయి కాలేజీ పక్కనున్న సీడీ షాపులో పనిచేసేది . ఆమెను చూడటం కోసం అతడు రోజు అక్కడికి వెళ్ళే వాడు , అవసరం లేకున్నా ఏదో ఒక సీడీ కొనే వాడు . చూపుల ద్వార ,చర్యల ద్వార తన ప్రేమను వ్యక్తపరిచే  వాడు .ఆమె ఎప్పటికైనా అర్ధం చేసుకోపోతుంద అని ఎదురు చూసే వాడు .

కనీ ఆమె నుండి ఎటువంటి ప్రతి స్పందన కనిపించలేదు . దాంతో తనలో తనే మధనపడ్డాడు . కుంగి పోయాడు . ఇక ఆ సీడీ షాప్ కి వెళ్ళడం మానేశాడు .
      రొజూ వచ్చే కుర్రాడు రాకపోవడం తో ఆమె అతడి కోసం వెతికింది .ఇవ్వాళా కాకపోతే రేపు ఐన వస్తాడేమో అని ఎదురు చూసింది .
ఎంతాకి రాకపోవడం తో అతడి అడ్రెస్స్ కనుక్కొని ఆశగా అతడి ఇంటికి వెళ్ళింది .ఇంట్లో అడుగుపెడుతూనే దండ వేసిన అతడి ఫోటో చూసి అవాక్కయ్యింది .తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను గ్రహించ లేదన్న బాధతో ఆత్మ హత్య చేసుకున్నాడని అతని తల్లి చెప్పిన మాట విని హతాశురాలుయ్యింది . అతడిని చూసే అవకాశం ఎలాగు లేదు , కనీసం ఒక్కసారి తన గది చూడొచ్చా అని అడిగింది , తల్లి సరేనంది .
        అతని గది లోకి అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయీ .ఆ గది నిండా సీడీ లే . సీడీ ర్యాక్ లో , టేబుల్ మీద ...... ఎక్కడ చూసినా సీడీ లే . మెల్లగా వెళ్లి ఒక సీడీ చేతిలోకి తీసుకుంది . వణుకుతున్న చేతులతో అన్ని సీడీ కవర్ లను తెరిచింది . వాటిని ప్యాక్ చేసి ఇచ్చే తప్పుడు అందులో తను వేసిన కాగితాలు అన్నిటిని కుప్పలా పోసింది . ప్రతి కాగితం మీద ఆమె  రాసిన మూడు అక్షరాలు ఆమెను వెక్కిరిస్తుంటే  ఏడ్పు ఆపుకోలేక కుప్పకూలిపోయింది . ఆ మూడు అక్షరాలు 'ఐ లవ్ యు '!
"నిజమైన ప్రేమ దెయ్యం లాంటిది . దాని 
            దాని గురించి మాట్లాడుకునే వారు తప్ప,
                                        చుసిన వాళ్ళు చాల తక్కువ !"
                     

Wednesday, January 18, 2012

 పిచ్చుక.....నా చిన్ననాటి స్నేహితుడు...మా ఇంటి కరెంటు మీటరు మీద వాలటానికి వచ్చినప్పటినించి పరిచయం...!! రోజు ఉదయం పదింటికల్లా వచ్చి వాలిపోయేవాడు...కిచ్ కిచ్ మంటూ సైగ చేసేవాడు..!! బుజ్జి బుజ్జి రెక్కలు ఆడిస్తూ అల్లరి చేసేవాడు...అటు ఇటు గెంతుతూ ఆడుకునేవాడు..!! వాడి అల్లరి చూస్తే ముచ్చట వేసేది...సమయం ఇట్టే గడిచిపోయేది..!! అలా కొన్నేళ్ళు సాగిన మా స్నేహం కొన్నాళ్ళలోనే ముగిసిపోయింది...వాడు రావటం మానేసాడు..నేనంటే ఇష్టంలేక కాదు...ఈ నాగరిక ప్రపంచం సృష్టించిన కలుషిత ప్రపంచంలో శ్వాసించలేక..!! వదిలి వెళ్ళిపోయాడు..నన్ను మాత్రమే కాదు...ఈ లోకాన్ని కూడా..!! వాడి చిట్టి పొట్టి పాదాల సడిలేక కరెంటు మీటరు బోసిపోయింది..గడియారం చిన్న ముళ్ళు పది దగ్గర ఆగిపోయింది..!! నా గొంతు మూగబోయింది..!! ఒక నిజం ఆధునిక ప్రపంచపు అడుగుల క్రిందపడి నలిగిపోయింది..!! పిచ్చుక చచ్చిపోయింది..!!