నిదుర పక్షులు రాల్చే
కళల ఈకల్ని కుంచెగా మార్చి
అందమైన నీ రూపాన్ని తీర్చి దిద్దాలని ప్రయత్నించా
ఇంద్రధనస్సు ప్రత్యక్షమైంది
హృదయ లేఖల అక్షర నక్షత్రాలు
కవిత్వం గా తీర్చి
అందమైన బావం కోసం ప్రయత్నిoచాను
సాగే సెలయేరు కనిపించింది
తెలవారే ఉదయాన
నీ పలకరింతకై పరితపించాను
లీల గా సుప్రబాత కీర్తన వినిపించింది
కల కళలాడే సాయం కాలానా
నీ స్పర్శ కై వేచి చూసాను
గుండెల పై వెన్నెల కురవడం తెలిసింది
ప్రియా .....
నీ జ్ఞాపకం గడియ తీస్తే చాలు ప్రకృతి అయి పలకరిస్తుంది ...
కళల ఈకల్ని కుంచెగా మార్చి
అందమైన నీ రూపాన్ని తీర్చి దిద్దాలని ప్రయత్నించా
ఇంద్రధనస్సు ప్రత్యక్షమైంది
హృదయ లేఖల అక్షర నక్షత్రాలు
కవిత్వం గా తీర్చి
అందమైన బావం కోసం ప్రయత్నిoచాను
సాగే సెలయేరు కనిపించింది
తెలవారే ఉదయాన
నీ పలకరింతకై పరితపించాను
లీల గా సుప్రబాత కీర్తన వినిపించింది
కల కళలాడే సాయం కాలానా
నీ స్పర్శ కై వేచి చూసాను
గుండెల పై వెన్నెల కురవడం తెలిసింది
ప్రియా .....
నీ జ్ఞాపకం గడియ తీస్తే చాలు ప్రకృతి అయి పలకరిస్తుంది ...
No comments:
Post a Comment