కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Wednesday, January 18, 2012

 పిచ్చుక.....నా చిన్ననాటి స్నేహితుడు...మా ఇంటి కరెంటు మీటరు మీద వాలటానికి వచ్చినప్పటినించి పరిచయం...!! రోజు ఉదయం పదింటికల్లా వచ్చి వాలిపోయేవాడు...కిచ్ కిచ్ మంటూ సైగ చేసేవాడు..!! బుజ్జి బుజ్జి రెక్కలు ఆడిస్తూ అల్లరి చేసేవాడు...అటు ఇటు గెంతుతూ ఆడుకునేవాడు..!! వాడి అల్లరి చూస్తే ముచ్చట వేసేది...సమయం ఇట్టే గడిచిపోయేది..!! అలా కొన్నేళ్ళు సాగిన మా స్నేహం కొన్నాళ్ళలోనే ముగిసిపోయింది...వాడు రావటం మానేసాడు..నేనంటే ఇష్టంలేక కాదు...ఈ నాగరిక ప్రపంచం సృష్టించిన కలుషిత ప్రపంచంలో శ్వాసించలేక..!! వదిలి వెళ్ళిపోయాడు..నన్ను మాత్రమే కాదు...ఈ లోకాన్ని కూడా..!! వాడి చిట్టి పొట్టి పాదాల సడిలేక కరెంటు మీటరు బోసిపోయింది..గడియారం చిన్న ముళ్ళు పది దగ్గర ఆగిపోయింది..!! నా గొంతు మూగబోయింది..!! ఒక నిజం ఆధునిక ప్రపంచపు అడుగుల క్రిందపడి నలిగిపోయింది..!! పిచ్చుక చచ్చిపోయింది..!!

No comments:

Post a Comment