కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Sunday, July 1, 2012

ఒక రొమాంటిక్ దెయ్యం కథ .....

రైలు ప్రయాణం .రాత్రి పదకొండు  దాటింది .అరుణ్ తప్ప బోగీలో అందరు నిద్రపోతున్నారు .తన ఎదుట సీటు ఖాలిగా ఉంది .రైలు ఎలుగురు అనే చిన్న రైల్వే స్టేషన్ లో ఆగింది .ఒక అందమైన అమ్మాయి రైలు ఎక్కింది .అ అమ్మాయి తన ముందు సీట్ లోనే కూర్చుంది .'అదృష్టం 'అనుకుంది అరుణ్ మనసు .ఐదు నిమిషాల్లో పరిచయమయ్యారు ఒకరికి ఒకరు .గంటలో ప్రేమలో పడ్డారు.
"అరుణ్ ......నువ్వు దెయ్యాలను నమ్ముతావా ?" అడిగింది అందమైన హారిక .
"నెవెర్ .......నమ్మను గాక నమ్మను " అన్నాడు అరుణ్ .
"మరి నువ్వు ?" అడిగాడు అరుణ్ .
"దెయ్యాలు ఉన్నాయో లేదో గాని దెయ్యాల కధలంటే మాత్రం చాల ఇష్టం " అన్నది హారిక .
"అయితే నీకు నచిన ఒక దెయ్యం కథ చెప్పు ?" ఆసక్తిగా అడిగాడు అరుణ్ .
హారిక ఇలా చెప్పింది .
'వరుణ్ ఒక అర్ధరాత్రి రైల్ లో ప్రయాణిస్తున్నాడు .బోగి లో అందరు నిద్ర పోతున్నారు .చింతలపల్లి అనే చిన్న రైల్ వే స్టేషన్ లో రైల్ ఆగింది .అందమైన అమ్మాయి రైల్ ఎక్కింది .వరుణ్ ఎదుట సీట్ లోనే కూర్చుంది .ఒకరికొకరు పరిచయమయారు .గంట లోనే వారు ప్రేమలో పడ్డారు ."నాకు దెయ్యాల కథలంటే ఇష్టం నేకు ఇష్టమేనా?" అని అడిగింది సారిక .
"ఇష్టమే గని దెయ్యాలను ఎప్పుడు చూడలేదు " అన్నాడు వరుణ్ .
"గంట క్రితమే నువ్వు దేయ్యని చూసావ్ "అన్నది సారిక .
"నువ్వు జోక్ చేస్తున్నావ్ డియర్ ...."అన్నాడు నవ్వుతు వరుణ్ .
"జోక్ చేయడం ఏంట్రా ఫూల్ ?నన్ను చూసావా లేదా ?"
బయనకంగా అరిచింది సారిక .వరుణ్ షాక్ తిన్నాడు .మరో షాక్ ఏమిటంటే గులాబీ చుడిధార్ లో కనిపించిన సారిక తెలుపు రంగు లోకి మరిపాయింది .నోట్లో నుంచి నాలుక బయటకి వచ్చింది .కళ్ళు చింత నిప్పుల్ల మెరుస్తున్నయ్ .పదాలు వెనిక్కి తిరగాయ్ .
'వామ్మో ' అరిచాడు వరుణ్ .ఈ దెబ్బకు నిద్ర పోయిన వాళ్ళంతా లేచారు .దెయ్యం మాయం ఐపోయింది !"
"కథ బాగుంది కానీ నమ్మశక్యం గా లేదు అన్నాడు" అరుణ్ .
"ఎందుకు నమ్మవ్ రా ఫూల్ ? నే ముందు ఉన్న ఈ హరికే ఆ సారిక " అంటూ బయనకంగా నవ్వడం ప్రారంబించింది హారిక ".కాళ్ళు వెనిక్కి తిరిగాయి .నాలుక బయటకి వచ్చింది .
'వామ్మో ' అని గట్టిగ అరిచాడు అరుణ్ .సడన్ బ్రేఅక్ వేసినట్టు రైల్ ఆగిపోయింది .
మోరల్ :టైం పాస్ కోసం ప్రేమలో పడకూడదు
         టైం చూసి ప్రేమలో పడాలి .