కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Sunday, November 4, 2012

ప్రేయసి కోసం

నిదుర పక్షులు రాల్చే
 కళల ఈకల్ని కుంచెగా మార్చి
అందమైన నీ రూపాన్ని తీర్చి దిద్దాలని ప్రయత్నించా
ఇంద్రధనస్సు ప్రత్యక్షమైంది
హృదయ లేఖల అక్షర నక్షత్రాలు
కవిత్వం గా  తీర్చి
అందమైన బావం కోసం ప్రయత్నిoచాను
సాగే సెలయేరు కనిపించింది
తెలవారే ఉదయాన
నీ పలకరింతకై పరితపించాను
లీల గా సుప్రబాత కీర్తన వినిపించింది
కల కళలాడే సాయం కాలానా
నీ స్పర్శ కై వేచి చూసాను
గుండెల పై వెన్నెల కురవడం తెలిసింది
ప్రియా .....
నీ జ్ఞాపకం గడియ తీస్తే చాలు ప్రకృతి అయి పలకరిస్తుంది ...

Monday, October 29, 2012

గుండెల్లో దాచుకున్న నీ జ్ఞాపకాలు కన్నీరుగా  బయటకు వస్తున్నాయి ...........

Tuesday, October 16, 2012

ప్రశాంతంగా ఉన్న నా ఈ జీవితం లో సుడిగాలి లా తను వచ్చి  అంతా చేధరగోట్టింది .....
      తన జ్ఞాపకాలు మాత్రం మిగిల్చి వెళ్లిపోయింది ...........

Saturday, September 22, 2012

ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు.... కాని! ఒక వ్యక్తికి నువ్వే ప్రపంచం.........
నీ కోసం వెతికి వెతికి అలిసనివి నా  కళ్ళు ,నా ప్రతి కన్నితో బిందువు లో నీ రూపమే ,
నువ్వు లేని నా  జీవితం అర్ధం లేనిదీ ,నిన్ను వెతుకుతూ నిన్ను చేరాలని ,
నా హృదయం పరితపించిన ఈ వేళ , నువ్వు నన్ను వద్దు అన్న నా మనుసు నువ్వే కావాలంటుంది ,
నువ్వు దూరం ఐన ప్రతి క్షణం నాకు ఒక యుగం లా  ఉంది ,
నువ్వు నన్ను చేరాలని , నీ ప్రేమ పొందాలని ,
ఎన్ని జన్మలైన నీ కోసం ఇలా ఎదురుచూస్తూ ,ఈ జీవితం లో వేరొకర్ని ఉహించుకోలేక ,
ఈ నా జీవితం తల్లడిల్లిపోతుంది ..........

Sunday, September 2, 2012

దేవుడు మనుషుల్ని ప్రేమించి ,వస్తువుల్ని వాడుకోవడానికి సృస్తించాడు ..
కానీ మనం మనుషుల్ని వాడుకొని ,వస్తువుల్ని ప్రేమిస్తున్నాం.....
ఎప్పుడు నేను ఒంటరి అని అనుకోవడం వల్లనేమో ,ఇప్పుడు నిజంగానే ఒంటరి గా  మిగిలిపోయా